స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday, 7 April 2014

గుప్పెడు మల్లెలు-71

1.
ఎక్కడున్నాయ్ ఎల్లలు,ఎగిరే పక్షికి,
పోవే పిచ్చిమనసా!
నీ ఊహలకేం... కోకొల్లలు
2.
పొద్దు గద్దెనెక్కితే,
అబ్బో... భజలెన్నెన్నో ప్రతీఇంట్లో,
దిక్కుమాలి దిగితే, నిద్దరేలే ప్రతీ కంట్లో
3.
ఎందుకు పుట్టానని ప్రశ్నించుకోకెప్పుడూ,
దేవుడిని చూపించమంటే
జవాబు చెప్పేవాడెవ్వడు?
4.
చక్కెరపాకం వేసేస్తే,
చక్కెరకేళీలొస్తాయా వేపచెట్టుకి,
మూర్ఖుడ్నొదిలేయ్ వాడిమట్టుకి
5.
పెద్దలన్నారేవో సామెతలంట,
అవి హద్దులు దాటేవైతే,
పెనురోతే అని నేనంటా.
6.
పొగబెడితే దోమలు పోతాయా?
పొగతాగే భామలూ ఉన్నారోయ్,
అమ్ముతూ తాగొద్దంటే ఎలా?
7.
ప్రతీ పదం,గుండె మెలితిప్పితే కవిత్వం
ప్రతీ మెలిక,ముడివిప్పితే
గెలిచినట్లేలే మానవత్వం
8.
రోజూ కొత్తేనా! తొలిపొద్దు సూరీడు,
అది నిజమే అనిపిస్తుంది,
అమ్మ ఒళ్లో పడుకున్నప్పుడు
9.
కొత్తసృష్టి జరగాలంటే,
కొంతపిచ్చి ఉండాలేమో?
చేదుపాట షూటింగైనా విదేశాలు వెళ్లాలేమో?
10.
చిన్నబీజం నుంచి చెట్టు మొలుస్తుంది,
చిన్నవాక్యమైనా దిక్కులు పలికిస్తుంది,
గుప్పెడు చాలు కె.కె, గుండెను తడిమేస్తుంది.
========================
Date: 02.04.2014