స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday, 6 January 2014

గుప్పెడు మల్లెలు-61

1.
పందే తెల్లని గోడమీద,
వీపురుద్దేది,
మూర్ఖుడే యాసిడ్ చల్లేది.
2.
ఫస్త్ రావడం కష్టం కాదురోయ్,
లెక్క చూసుకో,
ఫస్టులో ఎన్నాళ్లున్నావ్?...
3.
చిన్న చిల్లుపడ్డా,
ఓడ నీళ్లపాలే,
ఒక్కడే రచ్చకీడ్చడా కుటుంబాన్ని
4.
ఏడిస్తేనే
కష్టాలు తీరతాయంటే,
ఊళ్లన్నీ ఏర్లయిపోవూ...
5.
పాఠం చెబితే
అద్యాపకుడే,
జ్ఞానం బోధిస్తేనే గురువు
6.
నింగిలో ముసిరే మబ్బుకు
నేల మూల్గులు వినిపిస్తాయా,
చూపులు దించవోయ్ కాస్త కిందికి
7.
మసక అంటని అద్దమేది?
కలత చెందని హృదయమేది?
తుడిచేయ్... అంతా శుభ్రం.
8.
శ్రీకృష్ణుడికే తప్పలేదు,
శిశుపాలుడి ఆక్షేపణ,
మాటల తూటా, మనసునంటనీకు
9.
జీవితమంటే
తమాషా కాదు,
తప్పదులే పంటికింద చేదు.
10.
ఎరువేస్తెనే పైరుకు పుష్టి,
ఒరేయ్ కె.కె!!! అనుభవంతోనేరా,
పెరిగేది కవితా దృష్టి.
========================
Date: 03.01.2014



గుప్పెడు మల్లెలు-60

1.
యంత్రంకన్నా, మంత్రమ్మీదే గురి,
మనదేశంలో....అందుకే
సైంటిస్టులకన్నా,సన్నాసులెక్కువ.
2.
ఎంతకాలం అన్నదికాదు,
ఎదురుచూపంటే...
ఎంత ఓపిక అన్నదే....
3.
అందనిదాన్ని అపేక్షించకు,
అనిదినదాన్ని,
అందుకునేందుకు ఉపేక్షించకు.
4.
వాడుకుంటున్నాడని,
ఏడుపెందుకురోయ్,
వాడూ పనికొస్తాడనేగా ఇదంతా
5.
నాకెందుకిన్ని కష్టాలనుకోకు,
ఆ ప్రశ్నకి సమాధానం,
నువ్విస్తావని దేవుడి ధీమా.
6.
పొగిడితే ఇష్టం పెరుగుద్ది,
కానీ... పనిచేస్తేనే
గౌరవం పెరుగుద్ది.
7.
ఓదార్పుకోసం ఎదురుచూపెందుకు,
అద్దంలో చూడు,
ఆప్తమిత్రుడు కనిపిస్తాడు.
8.
పరుల తప్పులు మరచిపో,
ప్రపంచం మొత్తం
ఒక పూలవనం.
9.
సర్దుబాటు మనసుంటే,
కొదవుంటుందా
చిరునవ్వుకి...
10.
చేతిలో చెయ్యివెయ్యకు,
చేతకానప్పుడు ...
చెయ్యలేననడం చేతకానితనం కాదులే.
======================
Date: 30.12.2013
See more