స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday, 6 January 2014

గుప్పెడు మల్లెలు-60

1.
యంత్రంకన్నా, మంత్రమ్మీదే గురి,
మనదేశంలో....అందుకే
సైంటిస్టులకన్నా,సన్నాసులెక్కువ.
2.
ఎంతకాలం అన్నదికాదు,
ఎదురుచూపంటే...
ఎంత ఓపిక అన్నదే....
3.
అందనిదాన్ని అపేక్షించకు,
అనిదినదాన్ని,
అందుకునేందుకు ఉపేక్షించకు.
4.
వాడుకుంటున్నాడని,
ఏడుపెందుకురోయ్,
వాడూ పనికొస్తాడనేగా ఇదంతా
5.
నాకెందుకిన్ని కష్టాలనుకోకు,
ఆ ప్రశ్నకి సమాధానం,
నువ్విస్తావని దేవుడి ధీమా.
6.
పొగిడితే ఇష్టం పెరుగుద్ది,
కానీ... పనిచేస్తేనే
గౌరవం పెరుగుద్ది.
7.
ఓదార్పుకోసం ఎదురుచూపెందుకు,
అద్దంలో చూడు,
ఆప్తమిత్రుడు కనిపిస్తాడు.
8.
పరుల తప్పులు మరచిపో,
ప్రపంచం మొత్తం
ఒక పూలవనం.
9.
సర్దుబాటు మనసుంటే,
కొదవుంటుందా
చిరునవ్వుకి...
10.
చేతిలో చెయ్యివెయ్యకు,
చేతకానప్పుడు ...
చెయ్యలేననడం చేతకానితనం కాదులే.
======================
Date: 30.12.2013
See more

No comments:

Post a Comment