స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 14 September 2012

//మనసుతో వినాలి//

కవిత్వం అంటే ఏమిటి???
ఒక చిక్కుప్రశ్న,చాలా పెద్దప్రశ్న.
అది ఒక పరకాయ ప్రవేశం,
అప్పుడప్పుడు పవస్తు ప్రవేశం.
ఒక ఆలోచన, ఒక ఆక్రందన,
ఒక ఆవేశం, ఒక విజ్ఞానం,
విరహం,ప్రేమ,త్యాగం,లాలిత్యం
ఇంకా ఏదో,ఇంకేదో...
...

కవిత్వం,భావుకత్వం
ఎవడబ్బా సొమ్ముకాదు.
ఏ ఒక్కడి సొంతం కాదు.
మనం చూసేదే చూస్తూ,
మనకు తెలీని అంతరాల్ని
కొలిచే వాళ్ళెందరో!!!

రోడ్డుపైన బస్సో,కారో
నడిపేవాడు విన్యాసాలుచేస్తే,
తాగినడుపుతున్నడేమో అంటాడు ఒకడు.
తాగితే ఎలా నడపాలో ప్రాక్టీస్
చేస్తున్నాడని అంటాడు వేరొకడు.
దృశ్యం అదే,దృక్కోణం వేరు.

జానపదాలెన్నో,
జనం నుంచి పుట్టాయి.
అక్షరం రాయ చేతకానివారే
అయినా లక్షల భావాల్ని వినిపించారు.
లక్ష్మీకటాక్షం కనిపిస్తుంది.
కానీ వాణీ కటాక్షం వినిపిస్తుంది.
మనసుతోవినాలి... అంతే.
******************************
తేది:12/09/2012

No comments:

Post a Comment