స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Sunday, 23 September 2012

//అసంపూర్ణ స్వప్నాలు//

అసంపూర్ణ కలలు కనడం 
అలవాటే చాలామందికి,
రాత్రికిరాత్రే కొటీశ్వరుడైనట్లు,
చిత్రసీమనేలే హీరోలైనట్లు,
సిక్స్ తోటి విజయాన్ని,శతకాన్ని పూర్తిజేసినట్లు,
అందాలరాశితో హుందాగా గడిపినట్లు,
వేలమందిని,కనుసైగతో అదిలించినట్లు,
ఎక్కువగా నిద్రపోతే వచ్చేవి
కలలు కాక ఇంకేమిటి???

ఆ కలల్లో ఒక్క సుఖమే కావాలి.
డబ్బు కావాలి,జబ్బల్లో నొప్పి పుట్టకూడదు.
కారు,పేరు కావాలి,చెమటనీరు చింద కూడదు.
మనిషి ఎంత సుఖ లాలసుడంటే...
చినుకులు పడితే పరవశించినవాడే,
ఎడతెగని వాన కురిస్తే చిరాకు పడతాడు.
లేతచలికి తన్మయించినవాడే,
వణికించే చలికి ముడుచుకుపోతాడు.
తొలకరి ఎండని ఆశ్వాదించినవాడే,
మండే ఎండకి నీడని ఆశ్రయిస్తాడు.
కాలధర్మమైన ఋతువుల్ని కూడా
బండ బూతులు తిడుతూ గడిపేస్తాడు.

కలలు కనాలి,
అవి పూర్ణ స్వప్నాలు అయ్యుండాలి.
కలల సాకారానికి తలలకు పనిజెప్పాలి.
==============================
Date: 22/09/2012

No comments:

Post a Comment