స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday 3 September 2012

//నీ హక్కుని అస్త్రం చెయ్//


క్షమించు మిత్రమా!
తప్పంటున్నానని,
తప్పించుకుంటున్నావని ఆరోపిస్తున్నానని 
బాధపడకు.
తప్పదంటున్నాను..అంతే.

కుర్చీమీదున్నా,పక్కన కూర్చున్నా,
జరిగేవి,జరిపేవి మహాసభలే,
మోగేవి,సాగేవి ఆరోపణల అలలే,
రెప్పవాల్చినంత సరళంగా,
గాలిపీల్చినంత సహజంగా,

కరెంటుకోత ఎంతున్నా..గ్యాస్ కబుర్లతో
మహోజ్వలంగా కాంతి విరజిమ్ముతోంది.
గుక్కెడునీళ్ళకు గతిలేక పోయినా,
వాగ్ధానాల ధారలు ముంచేస్తున్నాయ్.
నిఖార్సయిన పల్కుల విత్తనాలు,ఎరువెయ్యకుండానే
నాల్కల పాదులై పాకి ఎరగా పంచేస్తున్నాయ్.

పిల్లులుప్పుడో గోడదూకడం మానేశాయ్.
దండెం మీద ఆరేసిన కండువాలా
ఇంటిపై జెండారంగులు మారుతుంటె
ప్రతీ జెండాకి ఎవేవో ఎజెండాలే,
మూడుగంటల రంగురీళ్ళ సినిమాలా
బహు రూపాల్లో చూపే భవితవ్యాలే,
అంతరాత్మగొంతునొక్కి,అబద్దాల తేనెపూసి
పెదాలు విషాలు కక్కుతున్నాయ్.
వినే చెవులు ఎగబడి వింటున్నాయ్.
తిరిగే రోజులు కలబడి దొర్లేస్తున్నాయ్.

ఎన్నో సుడిగుండాలు చూసిన నీకు,
ఇప్పుడెగిరే ఈ దుమ్ము నీ కంట్లో
కొట్టేందుకే అని తెలీదా???
స్వఘోషణల,పరదూషణల పరిభ్రమణంలో
చిక్కుకున్న ప్రేక్షకుడా!!!
వేదాంతం ముసుగులో వైరాగ్యం నటించకు.
నీ మౌళికహక్కుని అస్త్రం చెయ్.
ఈ నకిలీ దివ్వెలని అంతం చెయ్.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
Date: 01.09.2012

No comments:

Post a Comment