ప్రణాళిక ఉండాలి దేనికైనా,
పధకం సిద్ధం చెయ్యాలి ఏ పనికైనా,
సమయ పరిమితి అదుపుతప్పితే,
వాయిదాలతో క్యాలెండర్,పుటలు తిప్పితే
కాలం, ఖాళీ అవక మానుతుందా???
చూసే చూపుకి శక్తుంటే,
శూన్యంలో రంగుల చిత్రం కనిపిస్తుంది.
ఆవులింతల్ని, ఆవిరిపొగలుగా మార్చగల్గితే
అందుకునే లక్ష్యం, ఆరడుగుల దూరంలో అగుపిస్తుంది.
చెమట పట్టిందని,పిడికిలి బిగి సడలిపోతే ఎలా?
కారుమబ్బు అడ్డొచ్చిందని, పొడిచే పొద్దు ఆగిపోతుందా?
చేవున్న చిగురుకే చీడపురుగు పట్టేది,
ఎండుటాకుకి కాదు.
సత్తావున్న చేతికే చెమట పట్టేది.
పసలేని, ముసిలి కండకి కాదు.
అడ్డొచ్చే అవరోదాల్ని,గడ్డిపరకల్లా దాటేస్తే,
సాగే పాదం, లక్ష్యంపై చిరునామా ముద్రిస్తుంది.
సంకల్పానికి పరిపూర్ణ రూపం సాధిస్తేనే,
ఏ ఆశయానికైనా సార్ధకత లభిస్తుంది
::::::::::::::::::::::::::::::::::::::::::::::
Date: 28/08/2012
No comments:
Post a Comment