స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday 28 March 2014

గుప్పెడు మల్లెలు-68

1.
నిన్నుచూసి,నవ్వితే నవ్వనీ,
అసలే ఆనందానికి కరువొచ్చింది,
ఈ మద్య మనదేశంలో...
2.
ఇక్కడేదీ కాదు శాస్వతం,
ఎవడో చెప్పిన మెట్టవేదాంతం,
మరి ఉండిపోద్దా సమస్య మాత్రం....
3.
నిప్పు రాజుకోనప్పుడే,
పొగ గుప్పుమనేది,
సరుకులేనోడికే చిరాకు
4.
మనిషిని సృష్టించాడు దేవుడు,
ఈడు ఋణం తీర్చేసుకుంటున్నాడు,
వీధికో దేవుడ్ని పుట్టించి
5.
తమ్ముడూ! నీకిది అవమానం,
నువ్వుండగానే ఎలా కమ్మిందోయ్,
నీ మిత్రుడికి ఒంటరితనం.
6.
లాగివదిల్తేనేగా వెలుతుంది బాణం,
ఆవేశం పెరిగితేనేగా కె.కె.,
కళ్లెర్రజేస్తుంది కలం.
7.
ఇళ్లు కడుతున్నంతవరకే,
పనివాళ్లంతా మనవాళ్లు,
ఆస్తొచ్చేవరకే కన్నోళ్లు... ఈ రోజుల్లో
8.
ఊరుమొత్తం కాట్లోగలిసినా,
ఆకాశం సుస్థిరమేలే,
ఆస్తులుపోయినా, పేకంటే ఆశచావదులే
9.
ఆతిథ్యమిస్తానని,మృత్యువంటుంటుంది,
చేయికలిపావా, కుక్కిన పేనై
కాళ్లదగ్గర పడుంటుంది.
10.
గొడుగుతో అదిలిస్తే,
కుండపోత బెదిరిపోతుందా?
కాలం తప్పదంటే, మార్పు ఆగుతుందా.
======================
Date: 28.02.2014

No comments:

Post a Comment