స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 28 March 2014

గుప్పెడు మల్లెలు-70

1.
కారణాలు వెదక్కు,
కాలేదని చెప్పడానికి,
ఫలితాలు దొరకవ్ ఎప్పటికీ
2.
దుఃఖాన్ని పంచెయ్,
సంతోషం పెంచేయ్,
నలుగురూ ఉంటే సుఖమదేనోయ్....
3.
భయమెందుకోయ్ నీకు,
వాడెవడో కిందకి లాగుతాడని,
వాడున్నది నీ కిందనేగా
4.
టైములేదెవ్వడికీ ఇక్కడ,
నిన్ను ముందుకి తోసేందుకు,
ముందడుగెయ్యాల్సింది నువ్వే...మార్పుకి
5.
ఓడానని అనుకోకు,
మరు ప్రయత్నం చేస్తున్నంతవరకు,
ఆడుతున్నావనే అర్ధం.
6.
ఎం సీలో,ఫెవికోలో
ప్రతి పగులుకి ఒక మందుంటుంది,
విరిగినట్టేడుస్తావేరా వెర్రోడా
7.
కాళ్లు తడిపిందని కాస్త ముందుకెళితే,
కాటికంపదా సముద్రం,
తెగేదాక లాగొద్దు... నీలో శత్రువే అహం.
8.
వాదిస్తేనో, వేదిస్తేనో
నమ్మకాలు మారవ్,
నిజం నిరూపించాలంతే
9.
తెల్లగోడకే పంది వీపురుద్దేది,
అతిజాగ్రత్తకి పోతేనే,
అపాయం ఎదురయ్యేది... కదూ!
10.
సామాన్యుడికి,
అసమాన్యుడికి తేడా...
ఆడుపడే కష్టం.
===================
Date:26.03.2014

No comments:

Post a Comment