పల్లవి:-
అంచెలంచెలుగా ఎదుగు,
అచ్చంగా తెలుగు,
దృవతారలాంటి చెణుకు,
తలపిస్తు నువ్వు వెలుగు,...
చెలిమితో వేయి... ముందడుగు
అంచెలంచెలుగా ఎదుగు,
అచ్చంగా తెలుగు,
దృవతారలాంటి చెణుకు,
తలపిస్తు నువ్వు వెలుగు,...
చెలిమితో వేయి... ముందడుగు
చరణం:-
దేవుడి గుడిలో దీపంలా,
రోజు వెలిగే ఒక వ్యాసం,
చదువులబడిలో పాఠంలా,
ప్రతిరోజు ఓ అభ్యాసం,
అక్షర మడిలా కవితాగానం,
చురకలతోనే పరిహాసం,
ఇన్ని వర్ణాల కలగలుపు,
సాధించెను నీ తొలిగెలుపు,
(ఈ) విలువలు ఎపుడు నీతో నిలుపు .....//అంచెలంచెలుగా//
చరణం:-
పార్ధుని నడిపిన కృష్ణుడిలా
పద్మిణి చేసే సారధ్యం,
పూలత అల్లిన పందిరిలా
పెద్దలు ఇచ్చే సహకారం,
సభ్యుల మద్యన మమకారం,
బృందం మొత్తం బంధుత్వం,
సాహిత్యానికి నీ పిలుపు,
భావితరాలకి మేల్కొలుపు,
(నిను)దీవించునులే మన తెలుగు.....//అంచెలంచెలుగా//
========================
Date: 12.03.2014
https://soundcloud.com/kodanda-rao/acchamgaa-telugu
దేవుడి గుడిలో దీపంలా,
రోజు వెలిగే ఒక వ్యాసం,
చదువులబడిలో పాఠంలా,
ప్రతిరోజు ఓ అభ్యాసం,
అక్షర మడిలా కవితాగానం,
చురకలతోనే పరిహాసం,
ఇన్ని వర్ణాల కలగలుపు,
సాధించెను నీ తొలిగెలుపు,
(ఈ) విలువలు ఎపుడు నీతో నిలుపు .....//అంచెలంచెలుగా//
చరణం:-
పార్ధుని నడిపిన కృష్ణుడిలా
పద్మిణి చేసే సారధ్యం,
పూలత అల్లిన పందిరిలా
పెద్దలు ఇచ్చే సహకారం,
సభ్యుల మద్యన మమకారం,
బృందం మొత్తం బంధుత్వం,
సాహిత్యానికి నీ పిలుపు,
భావితరాలకి మేల్కొలుపు,
(నిను)దీవించునులే మన తెలుగు.....//అంచెలంచెలుగా//
========================
Date: 12.03.2014
https://soundcloud.com/kodanda-rao/acchamgaa-telugu
No comments:
Post a Comment