స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 28 March 2014

గుప్పెడు మల్లెలు-69

1.
కవరుపేజీ చెప్పగలదా,
కహానీ మొత్తం,
చూసినంతనే అంచనాలెందుకు?
2.
తినలెదేచెట్టు పళ్లెప్పుడూ,
కారణాలెందుకోయ్,
సాయం చెయ్యాలనుకున్నప్పుడు...
3.
గెలుపన్నది సులభమే,
అల ఒచ్చినప్పుడు,
తలొంచడం తెలిస్తే...
4.
తప్పుదారి తగులుతుంది,
ప్రయాణంలో చాలాసార్లు,
కొత్తదారి పరిచయానికి
5.
కాలమంటే గడియారమా,
నచ్చినప్పుడు సరిజెయ్యడానికి,
పరిగెత్తయినా సరే... అందుకోవాలంతే
6.
ప్రతిమెట్టు అనువే,
కులాసాగా కూర్చోవడానికి,
నువ్వు లొంగొద్దు ఆ మోసానికి
7.
వర్షంలో తడుస్తున్నప్పుడు,
ఆగాక నడుస్తున్నప్పుడు తేడాలేదా,
జీవితమంటే రెండూ కలిపేకదా
8.
కాలకూటంలా అడ్డుతగిలే,
తడిగుడ్డ వాక్యం,
"అదిసరే... కానీ"
9.
నీకధ చెప్పడానికి సిగ్గెందుకు?
అయితే ఆడికో పాఠం,
లేదా గొప్ప గుణపాఠం.
10.
అవసరాన్ని మించి,
మనిషి ఖర్చుపెట్టేది ఏమిటో,
అబ్బో... అది విశ్రాంతే అనుకుంటా.
====================
Date: 06.03.2014

No comments:

Post a Comment