స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Saturday, 25 August 2012

"వాదా"- 01

పల్లవి:-
నడక మరచిపోవునేమో పట్టణవాసి,
ప్రభుత్వాలు నడిపే రహదారులు చూసి,
దేవుడిచ్చిన కాళ్ళకు కళ్ళెం వేసి,
ప్రమాదాల తెరదీసెను, పేవ్ మెంటులు మూసి

చరణం:-
రోడ్డుపైన నడవడం ప్రతీవాడి హక్కేగా,
నడకకుంటు పడితే, అది వంటికి ముప్పేగా,
వాహనధారులకే రోడ్డులు రాసిచ్చేస్తే
బడికెళ్ళే పిల్లలైనా, బస్సుల్లో వెలుతుంటే
ఆయామం,వ్యాయామం అందని ద్రాక్షే
గమ్యానికి చేరడం తప్పని శిక్షే
ప్రగతి దాగిలేదు ఒక్క హైవేల్లోనే
జగతి నడవకుంటే, భవిత చుక్కల్లోనే
చరణం:-
పేరుకి మాత్రమే ఇది సుందర నగరం,
మగడు ఇల్లు చేరువరకు ఆగదు ఆత్రం,
గరీబోడి మరణానికి జవాబు కన్నీరా
ప్రణానికి వెలకట్టే నవాబు  లున్నారా?
రోడ్డుపక్క నీడకెపుడో చెల్లెను కాలం,
కాలిదారి జాడ కూడా అయ్యెను మాయం
ప్రశ్నించకమానదులే "వాదా" ఈ విద్రోహం

No comments:

Post a Comment