స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Saturday, 25 August 2012

"వాదా"-02

పల్లవి:భద్రంగా ఉండమంటిరే
చిత్రంగా రోడ్డుమీదే నడవమంటిరే....2సార్లు
పేవ్ మెంటు లేకుండా రోడ్డులన్ని జేస్తిరే,
యాక్సిడెంటు లెక్కల్ని లచ్చలల్లే పెంచిరే,
సచ్చినోడి నోటిమీద,నోటుపెట్టి మూస్తిరే...

చరణం:మందిలోన మూడోవంతు కాలినడక పోయేటోళ్ళే
బతుకుబండి తోసుకుంటూ బస్తీలో తిరిగెటోళ్ళే,
పేదోడై పుట్టడం చేసుకున్న పాపమా?
చేదోడు నివ్వమంటే మామీద కోపమా??
కారులున్నవాడికే, తారురోడ్డు లున్నవా??...//భద్రంగా//
చరణం:కాలిదారి కోసమంటూ, చట్టాలు జేసిరంట,
వాహనాల వీలుకై, ఆటినే  కాజేసిరంట,
దేశమంత నడిసేది, కారులల్ల కాదురా
రోడ్డుమీన నడిసేటోన్ని, బంధువల్లె సూడరా
నెత్తుటేరు పారకుండా, అడ్డుకట్టలెయ్యరో.....//భద్రంగా//

చరణం:
ఆశుపత్రి మందుల్ని,అమ్ముకున్న ఊరుకున్నం
ఇస్కూలు డబ్బులన్ని,మింగుతున్న ఊరుకున్నం
ధరలెన్నో పెంచి మమ్ము,దోచుకున్న ఊరుకున్నం
పళ్ళూడ గొట్టేల,పన్నులెస్తే ఊరుకున్నం
దారికూడా దోచేస్తే గమ్మున్న కూసుందుమా?/?
నిలదీయకండ ఉందుమా???
నిగ్గదీసి నిప్పులే రాజేయకుందుమా??? 


No comments:

Post a Comment