నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! నువు పుట్టిన, నీ పల్లెలని
పంచిచ్చే, నీ అనుభూతుల మల్లెలని
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! తోడబుట్టిన చెల్లెళ్ళని
బ్రతికి ఉన్న సెలయేల్లని
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! నీ బాల్యపు చేలికాల్లని
నిను మోసిన, వ్యధ తీర్చిన చలువ రాళ్ళని
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! నెత్తురు పంచిన నీ తల్లిని
విత్తును, పైరుగా మార్చిన నీ తండ్రిని
రాతిని, రత్నం చేసిన నీ గురువుని
నిను.. నిన్నుగ... అక్కున జేర్చుకొని.. సేద తీర్చు
నీ మాతృభాషని...
కే.కే.
Ok
ReplyDelete