కరగనిదే కొవ్వొత్తి, కాంతి పంచుతుందా???
మరగనిదే మంచినీరు, మబ్బు రూపు కడుతుంద???
అరగనిదే మంచిగంధం పరిమళం ఇస్తుందా???
విరగనిదే చెట్టు కొమ్మ, సెయ్య ఉద్భావిస్తుందా???
తరగనిదే శిల కడుపున శిల్పం పుడుతుందా???
తిరగనిదే మరయంత్రం, ధాన్యం బియ్యం అవుతుందా???
ఫలితం వచ్చేది ఎపుడూ, పెను ప్రళయం తర్వాతే
కష్టాలను ఓర్చినపుడే, మనిషిగా గెలిచినట్లు
గదిలోన దాక్కుంటే, కాలగమనం ఆగుతుందా???
మదిలోన చోటుంటే, లోకం నీ నుంచి దాగుతుందా???
లోకం ఎపుడూ నీ మనసుకి దర్పణం సుమా...
ప్రతిబింబం అందంగుంటే, దేవుని కి అది అర్పణం అని అర్ధం నేస్తమా !!!
కే.కే.
No comments:
Post a Comment