"రెండు నిముషాలు ఆలోచించి చూడు.....
మీన, మేషాలు పక్కన పెట్టు నేడు......"
"చేతకానితనాన్ని, జాతకాలతో.....
చేవలేని సత్తాని, లక్కు పేరుతో.....
ముడివేసి సరిపెట్టుకోకు.....
ఎండమావి వెంట నువ్వు పరుగు తీయకు......"
"తెగిన గాలిపటానికి ఎగురుడెంత???
నూతి గట్టు పైన కప్ప ప్రాకుడెంత????
నీటి పైన గాలి బుడగ కాలమెంత?????
నడమంత్రపు సిరి కున్న నిగ్గు ఎంత??????"
"ఒడ్డు చేరకున్నా.. కెరటం పరుగాపునా???
జిడ్డు కారుతున్నా ... గానుగ విసుగేక్కునా????
గట్టు దాటలేకున్నా... పసిపాపలు ఆగునా ????
యత్నిస్తే సృష్టిలో...
సకలం.. సుసాధ్యం..."
"ఏటిలోని ఈదులాడు చేప....
గూటిలోంచి నింగికేగురు పక్షి....
కదిలేటి చీమ... ...
కావా మనకి ఆదర్శం...
కళ్ళ ముందు నిదర్శనం... "
"శ్రమి ఇస్తే ఉంది ఫలం...
శ్రామలోనే ఉంది సుఖం...
స్వేదంతో సాధించే ప్రతి గింజ బలం... బలం..."
"కృషితో నాస్తి దుర్భిక్షం"
కే.కే.
Vrey good ,excellent
ReplyDelete