జాగ్రత్త తమ్ముడా!!!!!!
ఇదే నా హెచ్చరిక........
" నేనొక "కవి"నని విర్రవీగి ఏవేవో రచనలు చేస్తే...
నీ దేశపు దరిద్రాన్ని అక్షరంగా మలిస్తే...
నీ సమాజం అన్యాయాలను ...కవితగా నువు వినిపిస్తే...
నీ రాష్ట్రపు మతపిచ్చిని... పాటగా గానం చేస్తే...
నువు విన్న ఆకలి కేకలు... గేయంగా స్వరపరిస్తే...
నాయకుల దురాక్రమణలు ...వ్యాసంగా ప్రశ్నిస్తే..."
"దేశభక్తులు ఆగ్రహిస్తారు...
దేశద్రోహిగా ముద్ర వేస్తారు...
నీ కాగితాలు చించేస్తారు...
నీ మేధస్సుని చంపేస్తారు..."
"కాలువలై పారే మురికిని...
నేలపై పరిచిన పట్టు పరికిణి అని కీర్తించు...
ఏరుగ పారే నెత్తురు...
ఎరుపు రంగు అత్తరుగా వర్ణించు..."
జాగ్రత్త తమ్ముడా!!!!!!
ఇది నా హెచ్చరిక!!!
ఇదే నా హెచ్చరిక !!!!!
కే.కే.
No comments:
Post a Comment